వైరల్ వీడియో: చిన్నారి స్టెప్పులకు బిగ్ బీ ఫిదా

వైరల్ వీడియో: చిన్నారి స్టెప్పులకు బిగ్ బీ ఫిదా

ముంబై: కొందరు తమ ట్యాలెంట్‌‌‌తో సెలబ్రిటీలను కూడా ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా అలాంటి ఓ చిన్నారి డ్యాన్స్ పెర్ఫామెన్స్‌‌కు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఫిదా అయ్యారు. నలుపు రంగు కుర్తాలో, పసుపు దుపట్టా వేసుకున్న సదరు చిన్నారి ‘అప్నే ససురే కే ఆగే’ అనే హర్యానీ పాటకు హుషారుగా స్టెప్పులేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ డ్యాన్స్‌‌ వీడియోను చూసిన అమితాబ్ తన ఇన్‌‌స్టాగ్రామ్ అకౌంట్‌‌లో దీన్ని షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే 17 లక్షల వ్యూస్, 3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఎలాంటి ట్రెయినింగ్ లేకుండా అద్భుతంగా డ్యాన్స్ చేసిందంటూ వీడియోలోని చిన్నారిని బిగ్ బీ మెచ్చుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి, బిగ్ బీ ఫిదా అయిన ఈ చిన్నారి డ్యాన్స్ వీడియోను మీరూ చూసేయండి.