నా మనవరాలు భరోసా ఇచ్చింది

నా మనవరాలు భరోసా ఇచ్చింది

ఐశ్వర్య, ఆరాధ్య ఇంటికెళ్తుంటే కన్నీళ్లు ఆగలేదు: అమితాబ్
ముంబై: కరోనాకు ట్రీట్మెంట్ పొందుతున్న తాను త్వరలోనే కోలుకుంటానని మనవరాలు ఆరాధ్య భరోసా ఇచ్చిందని అమితాబ్ బచ్చన్ చెప్పారు. జులై 12 కరోనా బారిన పడ్డ ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్య.. కోలుకుని సోమవారం ఇంటికి వెళ్లారు. ” ఐశ్వర్య, ఆరాధ్య కరోనా నుంచి కోలుకున్నారు. వారు ఇంటికి వెళ్లే ముందు నా కళ్లలో నీళ్లు ఆగలేదు. మనవరాలు నన్ను హగ్ చేసుకొని ఎడవద్దని చెప్పింది. మీరు ‘త్వరలోనే ఇంటికి వస్తారు ‘ అంటూ భరోసా ఇచ్చింది. తన నమ్మకం కచ్చితంగా నిజమవుతుందని నమ్ముతున్నా” అని బిగ్బి ట్వీట్ చేశారు.