రాయదుర్గం మెట్రో స్టేషన్‌‌లో బిగ్ బి

రాయదుర్గం మెట్రో స్టేషన్‌‌లో బిగ్ బి

బాలీవుడ్ లెజెండరీ అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ లోని మెట్రో స్టేషన్ వద్ద తళుక్కుమన్నారు. సాధారణ ప్రయాణీకుడి వల్లే నిలబడి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం అమితాబ్ కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. కెమెరాల్లో, వీడియోలో బంధించేందుకు ఆసక్తి చూపారు. గత కొన్ని రోజుల నుంచి అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన లెటెస్ట్ ఫిల్మ్ ‘ప్రాజెక్టు కె (Project K) షూటింగ్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ సినిమా నాగ్ అశ్విన్ దర్వకత్వంలో తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ పతాకంపై సినిమా రూపొందుతోంది.

దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ క్రమంలో.. రాయదుర్గం మెట్రో స్టేషన్ లో ‘అమితాబ్’పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆయన నిలబడి ఉన్న ఫొటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సాయంత్రం రద్దీగా ఉండే సమయంలో.. కేవలం కెమెరామెన్స్, ఇతర చిత్ర బృందం మాత్రమే కనిపించిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే వైజయంతి మూవీస్ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రభాస్, రాఘేంద్ర రావు, నాని, దుల్కర్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. వైజయంతి మూవీస్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ లు ఇద్దరూ కలిసి రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్బంగా పలువురు అమితాబ్ బచ్చన్ ను సన్మానించారు.