బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు షూటింగ్ సెట్లో స్వల్ప గాయమైంది. ఆయన హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షో షూటింగ్లో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డారు. దీంతో ఆయన మోకాలికి స్వల్ప గాయమైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా షోలో వెల్లడించారు. ‘‘సాధారణంగా నేను స్టేజ్ మధ్యలో నిలబడి కేబీసీ షో ప్రారంభిస్తాను. కానీ నిన్న షూటింగ్ టైమ్‌లో జారిపడ్డాను. నా మోకాలికి గాయమైంది.
గాయం తీవ్రమైనదేమీ కాదు.. ఎవరూ ఆందోళన పడొద్దు. అయితే కంటెస్టెంట్స్‌ను ఆహ్వానించేందుకు స్టేజ్ మధ్యలోకి మాత్రం రాలేను. గాయంతో కొంచెం ఇబ్బందిగా ఉండడంతో సీట్ దగ్గర నిలుచుని వాళ్లను ఆహ్వానిస్తాను” అని అమితాబ్ వివరించారు. ఈ గాయం నుంచి తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.
