Actor Priyanshu:స్నేహితుడే చంపేశాడు.. 21 ఏళ్లకే ముగిసిన.. అమితాబ్తో కలిసి నటించిన కుర్రాడి జీవితం!

Actor Priyanshu:స్నేహితుడే చంపేశాడు.. 21 ఏళ్లకే ముగిసిన.. అమితాబ్తో కలిసి నటించిన కుర్రాడి జీవితం!

యంగ్ యాక్టర్ ప్రియాంషు ఠాకూర్ బాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. ఇతన్ని బాబు రవి సింగ్ ఛెత్రి అని కూడా పిలుస్తారు. స్పోర్ట్స్ డ్రామా 'ఝుండ్' సినిమాలో అమితాబ్తో పాటుగా నటించి మంచి గుర్తింపు పొందారు. అయితే, ఈ 21 ఏళ్ళ యాక్టర్ ప్రియాంషు ఠాకూర్ దారుణ హత్యకు గురయ్యారు.

బుధవారం (అక్టోబర్ 8న) ఉత్తర నాగ్‌పూర్‌లోని ఓం సాయి నగర్-2 ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో, అతని శరీరం అనేక కత్తిపోట్లకు గురై వైర్లతో కట్టివేసి కనిపించింది. అలా గాయాలతో పడి ఉన్న నటుడు ప్రియాంషును స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.

ఇపుడు ఈ సంఘటన ఉత్తర నాగ్‌పూర్‌ స్థానికులుని, మరియు నటుడి అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడు ప్రియాంషు ఠాకూర్ మరణాన్నికి సంబంధించి కేసు ఫైల్ చేసి, దర్యాప్తును చేపట్టారు జరిపట్కా పోలీసులు. 

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు: 

బుధవారం (అక్టోబర్ 8) తెల్లవారుజామున నటుడు ప్రియాంషు ఠాకూర్ హత్యకు గురయ్యారు. నిందితుడిని ధ్రువ్ లాల్ బహదూర్ సాహు (20) గా గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడు ధ్రువ్ లాల్ ని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. తాగిన మత్తులో ధ్రువ్ లాల్ అనే వ్యక్తి (నటుడు ప్రియాంషు ఫ్రెండ్) "ప్రియాంషుని అతని ఫ్రెండ్ ధ్రువ్ లాల్.. పదునైన ఆయుధంతో దాడి చేసి, అర్ధనగ్నంగా, ప్లాస్టిక్ వైర్లతో కట్టివేసి వదిలేశాడు. ఆ తర్వాత అతన్ని స్థానికులు మాయో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని వైద్యులు ప్రకటించారని" పోలీసులు తెలిపారు. 

►ALSO READ | 4 Tales Trailer: కంటెంట్ ఈజ్ కింగ్.. కొత్త దర్శకులు, కొత్త ఆలోచనలు.. ఆసక్తిగా ‘4 టేల్స్’ ట్రైలర్‌