
టాలీవుడ్ విలక్షణ దర్శకుల్లో ‘‘ఆర్జీవీ, హరీష్ శంకర్’’లు ఎప్పుడు ముందుంటారు. ఈ దర్శకుల మాటల శైలి ఎంత విభిన్నంగా ఉంటుందో, కొత్త దర్శకులను ఆదరించే పద్దతి కూడా అదేవిధంగా ఉంటుంది. కొత్త కథలతో వచ్చే దర్శకుల ప్రతిభను చాటిచెప్పడానికి తమ వంతు ప్రయత్నంగా నడుం బిగిస్తారు. ఎందుకంటే, ఈ డైరెక్టర్స్ ఎలాంటి ప్లాట్ఫామ్ లేకుండా, తమ టాలెంట్ తోనే ఇండస్ట్రీకి వచ్చారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఓ ఇద్దరు దర్శకుల క్రియేటివిటీని సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. వారే.. డైరెక్టర్స్ ‘కిషోర్ గుణన, కొత్తపల్లి సురేష్’.
ప్రస్తుతం టాలీవుడ్ కొత్త కథలతో ఉరకలేస్తుంది. కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ తరుణంలో నాలుగు ఇంట్రెస్టింగ్ కథలతో ఆడియన్స్ని మెప్పించాడనికి ‘కిషోర్ గుణన, కొత్తపల్లి సురేష్’ ముందుకొచ్చారు. మరి ఈ న్యూ టాలెంట్ హాంట్స్ రాసుకున్న కథలేంటీ? వారు తమ కథలతో ఏం చెప్పబోతున్నారనేది తెలుసుకుందాం.
కథాసుధ (Katha Sudha):
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్’ కథాసుధ (Katha Sudha) పేరిట ప్రతి ఆదివారం ఒక షార్ట్‌ఫిల్మ్‌ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ ఎలిమింట్స్ టచ్ చేయకుండా.. దర్శకులు రాసుకున్న కథను సూటిగా చెప్పడం, కొత్త టెక్నీషియన్స్, కొత్త యాక్టర్స్ను ప్రోత్సహించడం ఈ ‘కథాసుధ’ ముఖ్య ఉద్దేశం. అలా ‘4 టేల్స్’ (FourTales) అనే కొత్త మూవీ కథాసుధాలో రాబోతుంది.
ఈ సందర్భంగా ఇవాళ గురువారం (2025 అక్టోబర్ 9న) ‘4 టేల్స్’ ట్రైలర్ రిలీజ్ చేశారు డైరెక్టర్స్ ఆర్జీవీ, హరీష్ శంకర్లు. ఈ క్రమంలో ‘4 టేల్స్’ చిత్రబృందం యొక్క వినూత్న ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ, తమ బెస్ట్ విషెష్ అందించారు. ‘మాస్క్’, ‘రైడర్’, ‘రిధి’, ‘ఘటన’ పేర్లతో నాలుగు కథలను అందించనుంది ‘ఈటీవీ విన్’.
4 టేల్స్ ట్రైలర్ (FourTales):
‘‘ఇద్దరు దర్శకులు, 4 షార్ట్ ఫిల్మ్స్, 4 కథల ఎమోషన్స్’’.. వినడానికి బాగుంది కదా.. !! 4 టేల్స్ ట్రైలర్ కూడా అంతే హృద్యంగా సాగేలా ఉంది. డైరెక్టర్స్ ‘కిషోర్ గుణన, కొత్తపల్లి సురేష్లు’. కొత్త కథనంతో, ఆకట్టుకునే ఎమోషనల్ సీన్స్తో 4 టేల్స్ ట్రైలర్ రూపొందించారు. శరత్ యెర్రా, నిరంజన్ దాస్, అక్షయ్ వసూరి ల సినిమాటోగ్రఫీ.. దర్శకుల స్క్రీన్ ప్లేకి బలంగా నిలిచింది. చక్కటి విజువల్స్తో ఆడియన్స్కి ఫ్రెష్ ఫీల్ కలిగిస్తోంది.
ఓవరాల్గా ఈ 4 టేల్స్ ట్రైలర్.. సస్పెన్స్, డ్రామా, కొత్త ఉత్సాహంతో కూడిన నాలుగు ప్రత్యేక కథలతో ఆకట్టుకుంటుంది. ఈ ఆదివారం (అక్టోబర్ 12న) కథాసుధలో '4 టేల్స్' నాలుగు కథలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పటికే ఎన్నో ఫీల్ గుడ్ స్టోరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కథాసుధ.. '4 టేల్స్'తో ఎలాంటి అనుభూతిని అందించనుందో అనే ఆసక్తి నెలకొంది.
►ALSO READ | Crime Thriller: రియల్ క్రైమ్ ఇన్సిడెంట్స్తో ‘మటన్ సూప్’.. ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వంభర డైరెక్టర్
4 టేల్స్ మూవీని నరుడు బ్రతుకు నటన ఫేమ్ రిషికేశ్వర్ యోగి సమర్పిస్తుండగా, సురేష్ కొత్తపల్లి 'కథ గని పిక్చర్స్' బ్యానర్పై నిర్మించారు. కిషోర్ గుణన, కొత్తపల్లి సురేష్ స్క్రీన్ ప్లే & దర్శకత్వం అందించారు. ధృవ్ చిత్రన్, బిందు ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు. అనుదీప్ పోతునుక సహా రచయితగా బాధ్యతలు నిర్వహించారు.
Check out this super interesting trailer https://t.co/BL8DDLECdq All the best to @rishikeshwary@MeSureshK @etvwin
— Ram Gopal Varma (@RGVzoomin) October 9, 2025