Crime Thriller: రియల్ క్రైమ్‌ ఇన్సిడెంట్స్తో ‘మటన్ సూప్’.. ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వంభర డైరెక్టర్

Crime Thriller: రియల్ క్రైమ్‌ ఇన్సిడెంట్స్తో ‘మటన్ సూప్’.. ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వంభర డైరెక్టర్

రమణ్, వర్షా విశ్వనాథ్ జంటగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. విట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ ది క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనేది ట్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలు. అక్టోబర్ 10న సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసిన దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ ‘టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైవిధ్యంగా ఉంది. ట్రైలర్ ఎంత బాగుందో.. సినిమా కూడా అంత పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నాడు. హీరో రమణ్ మాట్లాడుతూ ‘దర్శకుడు రామచంద్ర అద్భుతంగా తీశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’ అని అన్నాడు.

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని దర్శకనిర్మాతలు తెలియజేశారు. నటులు జెమినీ సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పాల్గొన్నారు.