
- త్రివిధ దళాల నిర్ణయంపై అమిత్ షా అభినందనలు
న్యూఢిల్లీ : కరోనా వారియర్స్ అయిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసులను అభినందించాలని ఇండియన్ ఢిపెన్స్ తీసుకున్న నిర్ణయాన్ని హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. ఇలాంటి చర్యలు కరోనా పై పోరాడుతున్న వారి సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. ఢిపెన్స్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ” డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, శానిటేషన్ సిబ్బంది, మీడియాను అభినందించాలని సైనిక దళాలు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. కరోనా చేస్తున్న పోరులో ఇలాంటి చర్యల వారి సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని కచ్చితంగా చెప్పగలను ” అని అమిత్ షా ట్వీట్ చేశారు. ఇలాంటి సంక్షోభ సమయంలో మనమంతా కరోనా వారియర్స్ కు అండగా ఉండాలని కోరారు. కాగా కరోనా పై పోరులో కృషి చేస్తున్న వారందరినీ అభినందించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఎయిర్ ఫోర్స్ యుద్ధవిమానాలతో (ఫ్లైపాస్ట్) నిర్వహిస్తాయని, కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ అందించే హాస్పిటల్స్ పై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపిస్తాయని చెప్పారు. యుద్ధనౌకలపై దీపాల్ని వెలిగించి కరోనా వారియర్స్ కు సంఘీభావం తెలుపుతామని సీడీఎస్ చీఫ్ రావత్ తెలిపారు.