
హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కేంద్రమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. సోలిపేట రామలింగారెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. ఫస్ట్ నుంచి కూడా నరాలు తెగే ఉత్కంఠతో సాగిన కౌంటింగ్ చివరకు బీజేపీని విజయతీరాల్లోకి చేర్చింది. తెలంగాణ బీజేపీ నాయకులంతా సమష్టిగా పోరాడి దుబ్బాకలో విజయం సాధించినందుకు షా అభినందనలు తెలియజేశారు.