
సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh babu), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur kaaram). ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో తల్లికి దూరమైన కొడుకుగా మహేష్ కనిపించి..కొన్ని సీన్స్లో తనదైన భావోద్వేగాన్ని పండించాడు.
లేటెస్ట్గా ఈ సినిమా నుంచి అమ్మ(Amma Song) పై వచ్చే ఎమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఏదీ మనదనుకుంటాం..ఏదీ కాదనుకుంటాం..లేని తల రాతని వేతికే మనసుకు ఏమని చెప్తాం..అంటూ ట్యాగ్ ఇస్తూ సాంగ్ పోస్ట్ చేశారు.
Aedi manadhanukuntam..
— Guntur Kaaram (@GunturKaaram) January 26, 2024
Aedi kaadhanukuntamm...
Leni thala rathani vethike manasuku emani cheputham..❤️ ?
The trio @ramjowrites @MusicThaman @VishalMMishra weaves magic in a spellbinding way ?
- https://t.co/1Lr2uTC4tU@urstrulyMahesh #GunturKaaram#BlockbusterGunturKaaram pic.twitter.com/6oLWfD9Y3Q
పసి వాడయై వేచి చూస్తుందా బదులే రాని గతం. పగ వాడయై నింద మోస్తుందా ఎదుటే ఉన్న నిజం.. అంటూ సాగిన ఈ పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. ఈ పాటకు ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. విశాల్ మిశ్రా ఆలపించారు. ఈ మూవీ కి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. అందులో భాగంగా వచ్చిన ధమ్ మసాలా, కుర్చీ మడత పెట్టి, అండ్ ఓహ్ మై బేబీ సాంగ్స్ కుర్రకారుకి పిచ్చెక్కించేశాయి.
నిజానికి గుంటూరు కారం సినిమాకు మొదటిరోజు నుండే మిక్సుడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ రికార్డ్ లెవల్లో కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ఏకంగా రూ.231 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రీజనల్ మూవీస్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక పాజిటివ్ టాక్ వస్తే..ఏ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టేదో ఊహించుకోండి.