ఐపీఓకు నెఫ్రోప్లస్ రూ. 353 కోట్ల సేకరణ

ఐపీఓకు నెఫ్రోప్లస్ రూ. 353 కోట్ల సేకరణ

న్యూఢిల్లీ: డయాలసిస్ సేవలు అందించే హైదరాబాద్​ కంపెనీ  నెఫ్రోప్లస్, దాని బ్రాండ్ నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్, ఇనీషియల్​ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా నిధులను సమీకరించడానికి అనుమతి కోరుతూ సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను అందజేసింది.  ప్రతిపాదిత ఐపీఓలో రూ. 353.4 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ,  ప్రమోటర్లు,  ప్రస్తుత వాటాదారుల నుంచి  1.27 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్​) ఉంటుంది. ఓఎఫ్​ఎస్​లో భాగంగా, ప్రమోటర్లు -- ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 2, హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ పేరెంట్ లిమిటెడ్, ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌కార్ప్ గ్రోత్ ఆపర్చునిటీ ఫండ్,  ఎడోరాస్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ -- షేర్లను అమ్ముతాయి.

 ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌కార్ప్ ఇండియా ప్రైవేట్ ఈక్విటీ ఆపర్చునిటీ లిమిటెడ్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, 360 వన్ స్పెషల్ ఆపర్చునిటీస్ ఫండ్ - సిరీస్ 9,  360 వన్ స్పెషల్ ఆపర్చునిటీస్ ఫండ్ - సిరీస్ 10 వంటి ఇతర వాటాదారులు కూడా వాటాలను విక్రయిస్తారు.  కొత్త ఇష్యూ ద్వారా వచ్చే నిధులను భారతదేశంలో కొత్త డయాలసిస్ క్లినిక్‌‌‌‌‌‌‌‌లను ప్రారంభించడానికి, అప్పుల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వాడాలని నెఫ్రోప్లస్ నిర్ణయించింది. కంపెనీ రూ. 70.6 కోట్ల వరకు ప్రీ-ఐపీఓ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ద్వారా సేకరించవచ్చు. 

ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్ నిర్వహిస్తే, కొత్త ఇష్యూ సైజు తగ్గుతుంది. 2009లో ఏర్పాటైన నెఫ్రోప్లస్, దేశవిదేశాల్లో డయాలసిస్ సేవలను అందిస్తుంది.  హోమ్ హిమోడయాలసిస్, హిమోడయాఫిల్ట్రేషన్, హాలిడే డయాలసిస్, కాల్ ఆన్ డయాలసిస్  వీల్స్ ఆన్ డయాలసిస్ వంటి సేవలనూ అందిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో, నెఫ్రోప్లస్ కార్యకలాపాల ద్వారా రూ. 755.8 కోట్ల ఆదాయాన్ని,  రూ. 67 కోట్ల పన్ను తర్వాత లాభాన్ని సాధించింది.  ఇదిలా ఉంటే, సమరా క్యాపిటల్- మద్దతుగల సహజానంద్ మెడికల్ టెక్ సెబీకి ఐపీఓ పత్రాలను దాఖలు చేసింది. ఇది కార్డియాక్ స్టెంట్లను తయారు చేస్తుంది. ఐపీఓ పూర్తిగా 2.76 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ -ఫర్ -సేల్ (ఓఎఫ్​ఎస్​) విధానంలో ఉంటుంది. అమాగీ మీడియా ల్యాబ్స్ కూడా ఐపీఓ కోసం దరఖాస్తు చేసింది. తాజా ఇష్యూ ద్వారా రూ. 1,020-కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. వీడియో కంటెంట్ కోసం క్లౌడ్ -ఆధారిత సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ను సేవ (సాస్​)లను అందించే అమాగి మీడియా ల్యాబ్స్ ఐపీఓలో ఫ్రెష్​ఇష్యూ, ఓఎఫ్​ఎస్​

ఉంటాయి.