ఎంపీ నవనీత్​రాణాకు చంపేస్తామంటూ బెదిరింపులు

ఎంపీ నవనీత్​రాణాకు చంపేస్తామంటూ బెదిరింపులు
  • చంపేస్తామంటూ ఆడియో క్లిప్​ పంపిన దుండగులు

అమరావతి: మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గ ఎంపీ నవనీత్​ రాణాను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపు మెసేజ్​ పంపించారు. ఎంపీ మొబైల్​​కు ఆడియో క్లిప్‌‌‌‌ పంపిన దుండగులు.. ఎంపీతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్‌‌ఎస్‌‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌‌పై అభ్యంతరకర పదాలు ఉపయోగించారు.

ఈ నెల 3న ఆమె ఫోన్​కు బెదిరింపులు రాగా.. ఆమె పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ జరుగుతోందని చెప్పారు.