అమెరికాలో అమూల్​

అమెరికాలో అమూల్​

ఆనంద్ : డెయిరీ బ్రాండ్ అమూల్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అమెరికాలో తన ఉత్పత్తులను అందించడానికి రెడీ అవుతోంది. ఇందుకోసం మిచిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. ఈ నెల 20న డెట్రాయిట్‌‌లో జరిగిన వారి వార్షిక సమావేశంలో దీనిపై ప్రకటన చేసింది. అమూల్‌‌ను గుజరాత్​ సహకార మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ నిర్వహిస్తోంది.  

అమూల్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దీని కింద 18 వేల పాల సహకార కమిటీలు ఉన్నాయి. 36 వేల మంది రైతులు దీనికి రోజుకు 3.5 కోట్ల లీటర్లకు పైగా పాలు పోస్తారు.  ప్రపంచ పాల ఉత్పత్తిలో మనదేశ వాటా దాదాపు 21 శాతం ఉంటుంది.