V6 News

15న ‘బచావో హైదరాబాద్’ పేరుతో అఖిలపక్ష భేటీ

15న ‘బచావో హైదరాబాద్’ పేరుతో అఖిలపక్ష భేటీ

హైదరాబాద్ : బుధవారం (జూన్ 15న) ‘బచావో హైదరాబాద్’ పేరుతో అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో టీటీడీపీ, టీజెఎస్, బీఎస్పీ, వామపక్ష పార్టీలు, ఆప్, జనసేన, వైఎస్ఆర్ సీపీ, ఇంటి పార్టీ, లోక్ సత్తా పార్టీల ప్రతినిధులు, మహిళా సంఘాలు, మేధావులు, పాత్రికేయ ప్రముఖులు పాల్గొననున్నారు. 

అఖిల పక్ష భేటీకి రావాలంటూ రేవంత్ రెడ్డి స్వయంగా వివిధ పార్టీ అధ్యక్షులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, షర్మిలకు ఫోన్ చేసి రావాలని రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లో డ్రగ్స్, జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్, లా అండ్ ఆర్డర్ లపై చర్చించనున్నారు.