అంబాలా: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. భూ వివాదంలో ఓ మాజీ సైనికోద్యోగి తన తల్లి, సోదరుడు, మేనకోడలు సహా ఆరుగురిని గొడ్డలితో నరికి చంపాడు. నారైన్‌గర్‌లోని రాటర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. దాడిలో తీవ్రంగా గాయపడిన అతని మేనకోడలు చండీగఢ్ పీజీఐఎంఈఆర్‌లో ట్రీట్‌మెంట్‌తీసుకుంటూ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
మృతుల్లో నిందితుడి తల్లి(65), సోదరుడు(35), సోనియా(32), వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాధితులు నిద్రలో ఉండగా నిందితుడు భూషణ్ కుమార్ గొడ్డలితో నరికి చంపాడని, ఆ తర్వాత మృతదేహాలను తన ఇంట్లో కాల్చివేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. నిందితుడి తండ్రి ఓంప్రకాశ్ కుమార్ అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అన్నదమ్ముల
మధ్య జరిగిన భూవివాదమే ఈ ఘటనకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు.
