నేపాల్​లో భూకంపం.. దాదాపు 100 ఇండ్లు డ్యామేజీ

నేపాల్​లో భూకంపం.. దాదాపు 100 ఇండ్లు డ్యామేజీ

కాఠ్మాండు: నేపాల్ రాజధాని కాఠ్మాండులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై తీవ్రత 6.1 పాయింట్లుగా నమోదైంది. అరగంటలో నాలుగుసార్లు భూమి కంపించడంతో జనం ఆందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఆదివారం ఉదయం 7:39 గంటలకు భూకంపం సంభవించిందని, ఆ తర్వాత మరో మూడుసార్లు భూమి కంపించిందని అధికారులు తెలిపారు. 

భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై వరుసగా 4.3. 4.3, 4.1గా నమోదైందని చెప్పారు. ధాడింగ్ జిల్లాలో భూకంప కేంద్రం ఉందని.. బాగ్​మతి, గండకీ ప్రావిన్సులలోనూ ప్రకంపనలు వచ్చాయన్నారు. ‘‘భూకంపం వల్ల 20 ఇండ్లు దెబ్బతిన్నాయి. మరో 75 ఇండ్లకు పైగా పగుళ్లు వచ్చాయి. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తూ ఎవరూ చనిపోలేదు” అని అధికారులు వెల్లడించారు.