Shocking Video: ఛీ..ఛీ.. ఇదో బతుకా చెప్పండి.. పాడెక్కే వయసులో పాడు పని..

Shocking Video: ఛీ..ఛీ.. ఇదో బతుకా చెప్పండి.. పాడెక్కే వయసులో పాడు పని..

ఇంటర్నెట్లో రోజుకు కొన్ని లక్షల వీడియోలు వైరల్ అవుతుంటాయ్. అందులో కొన్ని వీడియోలు మళ్లీమళ్లీ చూడాలనిపించేలా ఉంటే, మరికొన్ని వీడియోలు కంటపడ్డప్పుడు ఒళ్లు మండిపోతుంటుంది. రక్తం మరిగిపోతుంటుంది. ఛీ..ఛీ.. రోజురోజుకూ ఇలా తయారవుతున్నారేంటో అనే అసహ్య భావన కలుగుతుంది. సరిగ్గా అలాంటి చండాలమైన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్లోని బిసౌలిలో జరిగిన ఓ ఘటన నెటిజన్లను నిర్ఘాంతపోయేలా చేసింది. కొందరు మనుషులు మహిళల పట్ల ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో, మహిళలతో ఎంత దిగజారి నడుచుకుంటున్నారో ఈ ఘటన వీడియో కళ్లకు కట్టింది. ఒక ముసలోడి వంకర బుద్ధికి సంబంధించిన వీడియో ఇది.

ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ఏంటంటే.. ఉత్తరప్రదేశ్లోని బిసౌలిలో ఒక ఫ్యాన్సీ షాపు ఉంది. ఫ్యాన్సీ దుకాణాలకు మహిళలు ఎక్కువగా వెళుతుంటారు. అలానే ఒక యువతి ఆ ఫ్యాన్సీ షాపుకు వెళ్లింది. వక్ర బుద్ధి ఉన్న ఒక ముసలోడు కామంతో కళ్లు మూసుకుపోయి అప్పటికే అక్కడ ఉన్నాడు. ఏదో కొంటున్నట్టు ఆ ఫ్యాన్సీ షాపుకు వెళ్లిన ఆ నీచ బుద్ధి కలిగిన ముసలోడు సదరు యువతి వెనుకే నిల్చున్నాడు. ఆ యువతి తనక అవసరమైనవేవో షాపు అతనికి చెప్పి వాటి వంక చూస్తూ ఉంది. షాపులో ఉన్న మిగిలిన మహిళలు కూడా వారికి కావాల్సినవి ఏవో కొనుక్కుంటూ ఉన్నారు.

ఎవరూ తనను గమనించడం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆ యువతి వెనుక నిల్చున్న ముసలోడు తనలో ఉన్న కామోన్మాదిని నిద్రలేపాడు. మనవరాలి వయసున్న ఆ యువతి వెనుక నిల్చుని ఆమె జుట్టును తాకే ప్రయత్నం చేశాడు. ఒకటి రెండు సార్లు ఆమె జుట్టును తాకాడు. ఆ తర్వాత అతనిలో కామోన్మాదం మరింత పెరిగి ఆ యువతికి మరింత దగ్గర జరిగి ఆమె జుట్టును వాసన చూశాడు. పైశాచిక ఆనందం పొందాడు. ఆ యువతి గానీ, ఆ షాపులో ఉన్న వాళ్లు గానీ ఆ ముసలోడి దుశ్చర్యను గమనించలేదు. కానీ.. సీసీ కెమెరా ఈ ముసలోడి సిగ్గుమాలిన పనిని రికార్డ్ చేసింది. నలుగురికీ ఏది మంచి, ఏది చెడు చెప్పాల్సిన వయసులో ఆ ముసలోడు అంత చండాలమైన పని చేయడం చూసి నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. ఒక ‘ఎక్స్’ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేయగా 5.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే ఈ వీడియో ఎంత వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కామోన్మాదులను కఠినంగా శిక్షించాలని వీడియో కింద కామెంట్లు వెల్లువెత్తాయి.