గణపురం, వెలుగు: చారిత్రక కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయ కోటగుళ్లను శనివారం ఇంగ్లాండ్ కు చెందిన దంపతులు మిచెల్ రిచర్డ్, ఎలిజబెత్ సందర్శించారు. ఆలయ చరిత్రను, శిల్పకళా నైపుణ్యాన్ని రామప్ప గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం ఇంగ్లాండ్ దేశస్థులు ఆలయ ప్రాంగణంలోని శివ ద్వారా పాలక విగ్రహాలను ఫొటోలు, వీడియోలుగా తీసుకున్నారు.
