
ఆరు మాసాలుగా రాజేంద్రనగర్ ప్రాంత ప్రజలను వణికించిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. గగన్ పహడ్ వద్ద రోడ్డుపై హంగామా చేసి తప్పించుకొని రాజేంద్రనగర్ అటవీ ప్రాంతంలోకి పారిపోయిన చిరుత.. శనివారం రాత్రి బోనులో పడింది. ఈ చిరుత నగర శివారులో సంచరిస్తూ.. మూగ జీవాలపై దాడి చేస్తుంది. శుక్రవారం రాత్రి కూడా వాలంతరి సమీపంలో రెండు లేగ దూడలపై దాడిచేసి హతమార్చింది. అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత శనివారం చిక్కింది. చిక్కిన చిరుతకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి.. చిరుతను మగచిరుతగా గుర్తించారు. అనంతరం చిరుతను జూ పార్కుకు తరలించనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి చిరుతను నల్లమల అడవిలో వదలనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.