లండన్ అంత మంచుకొండ చీలిపోయింది

లండన్ అంత మంచుకొండ చీలిపోయింది

గ్రేటర్  లండన్  అంత సైజులో ఉండే భారీ మంచుకొండ ఒకటి అంటార్కిటికాలో చీలిపోయింది. బ్రిటన్  హాలీ రీసెర్చ్ స్టేషన్ (ఈ స్టేషన్ లో బ్రిటన్  సైంటిస్టులు పనిచేస్తుంటారు) కు 12 కిలోమీటర్ల దూరంలో బ్రంట్ ఐస్  షెల్ఫ్ అనే ప్రాంతంలో ఇటీవలే ఈ ఘటన జరిగింది. ఈ ఐస్ బర్గ్  సైజు 490 అడుగుల మందం, 600 చదరపు మైళ్లు అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ సమయంలో బ్రిటిష్  అంటార్కిటిక్  సర్వే (బీఏఎస్) హాలీ రీసెర్చ్  స్టేషన్ లో తాము, తమ సిబ్బంది పనిచేస్తున్నామని, తామంతా సేఫ్​ గా ఉన్నామని సైంటిస్టులు వెల్లడించారు. ఐస్ బర్గ్ చీలినపుడు ఎదురయ్యే పరిణామాలకు తగిన ఏర్పాట్లు చేసుకున్నామని  బీఏఎస్  డైరెక్టర్, ప్రొఫెసర్  డేం జేన్ ఫ్రాన్సిన్  తెలిపారు.

‘‘హాలీ రీసెర్చ్  స్టేషన్  చుట్టూ ఉండే జీపీఎస్  పరికరాల సాయంతో రోజూ ఐస్  షెల్ఫ్ ను కొలుస్తుంటాం. ఆ మెజర్ మెంట్ అంతా ఆటోమేటిక్ గా జరుగుతుంది. దీంతో ఐస్ షెల్ఫ్ ఎంత మేర కుచించుకుపోయింది, ఎంత దూరం కదిలిందో తెలుస్తుంది. దీనికి సంబంధించిన డేటాను అనాలిసిస్  కోసం కేంబ్రిడ్జ్ కు పంపాం” అని ఫ్రాన్సిస్  పేర్కొన్నారు. ఐస్ బర్గ్  కదిలినా రిసర్చ్  స్టేషన్ పై ఎలాంటి ప్రభావం పడలేదని గ్లేసియోలజిస్టులు (గ్లేసియర్ లపై అధ్యయనం చేసేవారు) చెప్పారని ఫ్రాన్సిస్  తెలిపారు.  కాగా, 1915లో కూడా అంటార్కిటికాలోనే భారీ మంచుదిబ్బ ఒకటి చీలిపోయింది.‑ లండన్