
అమెరికా మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలో చైనీస్ న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో శనివారం అర్థరాత్రి ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మాంటెరీ పార్క్‌లో చైనీస్ లూనార్ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతండగా.. ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో చాలా మందికి గాయాలయ్యాయి.