డబుల్ ఇండ్లు ఇప్పిస్తానని మహిళ చీటింగ్

డబుల్ ఇండ్లు ఇప్పిస్తానని మహిళ చీటింగ్
  • నలుగురి నుంచి రూ. 2.30 లక్షలు వసూలు 
  • నిందితురాలిని రిమాండ్​కు పంపిన పోలీసులు

మాదాపూర్, వెలుగు:  డబుల్​బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానని ఓ మహిళ పలువురి నుంచి డబ్బులు తీసుకుని చీటింగ్‌‌కు పాల్పడిన ఘటన మాదాపూర్​పోలీస్​స్టేషన్​పరిధిలో చోటు చేసుకుంది.  ఎస్ఐ వెంకట్​తెలిపిన ప్రకారం.. బోరబండ సైట్3కి చెందిన గోకం సూరి మాదాపూర్​శిల్పారామంలో టికెట్​కౌంటర్‌‌‌‌లో పని చేస్తున్నాడు. చార్మినార్​సుల్తాన్​షాహి ప్రాంతానికి చెందిన జ్యోతి (46)తో సూరికి పరిచయం ఉంది.  కొద్ది రోజుల కిందట ఆమె శిల్పారామం చూసేందుకు వచ్చిన సమయంలో డబుల్ ఇండ్లు కావాలంటే ఇప్పిస్తానని, తనకు కలెక్టర్​ఆఫీస్‌‌లో తెలిసిన వాళ్లు ఉన్నారని సూరికి చెప్పింది. 

ఆమె మాటలు నమ్మిన అతడు మొదట రూ. 50 వేలు ఇచ్చాడు. అదేవిధంగా సూరి అన్న రూ. 30 వేలు, వదిన రూ. 50 వేలు, చెల్లెలు రూ.50 వేలు, అత్త రూ.50 వేల చొప్పున జ్యోతికి ఇచ్చారు.  కొన్ని రోజుల తర్వాత సూరి ఇండ్లపై ఆమెను అడగగా సమాధానం దాట వేస్తూ వచ్చింది.  శుక్రవారం శిల్పారామం వచ్చిన జ్యోతిని మరోసారి సూరి నిలదీశాడు. దీంతో సమాధానం చెప్పకపోవడంతో  అనుమానం వచ్చి మాదాపూర్​పోలీసులకు కంప్లైంట్​ చేయగా జ్యోతిపై చీటింగ్​ కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్​ చేసి రిమాండ్‌‌కు తరలించారు.