
జూలూరుపాడు, వెలుగు : బైక్, ఆటో ఢీకొనడంతో గాయపడ్డ వ్యక్తిని 108లో దవాఖానాకు తీసుకువెళ్తుండగా అది మొరాయించింది. దీంతో ట్రీట్మెంట్అందడంలో ఆలస్యమై ఆ వ్యక్తి చనిపోయాడు. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలంలోని గుండ్లరేవుకు చెందిన గూగులోత్ఈరియా (58) శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పాపకొల్లు క్రాస్ రోడ్డు వద్ద బైక్ పై వెళ్తుండగా ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానాకు 108లో తరలిస్తుండగా 4 కిలోమీటర్లు వెళ్లగానే మధ్యలో ఆగిపోయింది. మరో 108 వెహికల్ రావడానికి గంట టైం పట్టింది. అప్పటికే లేట్కావడంతో దవాఖానాకు తీసుకెళ్లేసరికి అతడి పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ సాయంత్రం ఆరు గంటలకు చనిపోయాడు.