ఎమ్మెల్యే అనిల్జాదవ్ క్షమాపణలు చెప్పాలి : కాంగ్రెస్ అధికార ప్రతినిధి చంటి

ఎమ్మెల్యే అనిల్జాదవ్ క్షమాపణలు చెప్పాలి : కాంగ్రెస్ అధికార ప్రతినిధి చంటి
  • కాంగ్రెస్​ అధికార ప్రతినిధి చంటి డిమాండ్

బోథ్, వెలుగు: నియోజకవర్గంలో ముఖ్యమంత్రిని గానీ, మంత్రులను గాని అడుగుపెట్టనీయొద్దని కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బోథ్​ఎమ్మెల్యే అనిల్​ జాదవ్​ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ​పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి డిమాండ్ ​చేశారు. సోమవారం బోథ్​లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ లేకుండా నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొట్టే కొబ్బరికాయలు, చేసే రిబ్బన్ కటింగ్​లకు నిధులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

 సీఎం రేవంత్​ రెడ్డి చొరవతోనే నియోజకవర్గానికి నిధులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​చేశారు. సమావేశంలో కాంగ్రెస్​నాయకులు పాల్గొన్నారు.