రహదారి పక్కన నాటిన మొక్కలు తొలగిస్తే రూ.10 వేలు ఫైన్ : అటవీ శాఖ ఆఫీసర్లు

  రహదారి పక్కన నాటిన మొక్కలు తొలగిస్తే రూ.10 వేలు ఫైన్  : అటవీ శాఖ ఆఫీసర్లు

నేరడిగొండ, వెలుగు: నేరడిగొండ మండలంలోని ఎక్స్ రోడ్ నుంచి బోథ్ నియోజకవర్గానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా అటవీ శాఖ ఆఫీసర్లు మొక్కలు నాటి ట్రీ గార్డులు అమర్చారు. కాగా ఆ మొక్కలను తొలగిస్తే రూ.10 వేలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని ట్రీ గార్డులపై స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. 

నాటిన ప్రతి మొక్క ట్రీ గార్డులపై ఈ స్టిక్కర్లను అటవీ శాఖ ఆఫీ సర్లు ఏర్పాటు చేశారు. వాటిని చూసిన ప్రజలు మొక్కల సంరక్షణకు అటవీ శాఖ ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.