నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో సన్న వడ్ల బోనస్ ఇవ్వాలని రైతుల ఆందోళన

నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో సన్న వడ్ల బోనస్ ఇవ్వాలని రైతుల ఆందోళన
  • రెండు గంటలపాటు రాస్తారోకో
  • అడిషనల్ కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ

ఖానాపూర్, వెలుగు: గతేడాది యాసంగి సీజన్ సన్నధ్యానం బోనస్ డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ రైతులు ఆందోళన చేశారు. సోమవారం పట్టణ శివారులోని కుమ్రం భీం చౌరస్తా వద్ద బాసర, మంచిర్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన సన్న వడ్ల బోనస్​ను జమ చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు.

 సన్న వడ్ల బోనస్ కోసం ఎన్నో సార్లు వ్యవసాయ శాఖ అధికారులకు కలిసినా ఎలాంటి స్పందన లేదన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సుజాత రెడ్డి అక్కడకు వచ్చి రైతులతో మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్​తో ఫోన్​లో మాట్లాడారు. సన్న వడ్ల బోనస్ త్వరలోనే రైతుల ఖాతాలో వేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రయాణికులు ఇబ్బం దులు పడ్డారు.