ఇవాళ (డిసెంబర్ 30) పాలమూరులో ఉద్యోగ మేళా

ఇవాళ (డిసెంబర్ 30)  పాలమూరులో ఉద్యోగ మేళా

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 30న నగరంలోని ఎంప్లాయ్​మెంట్​ ఆఫీస్​ ఆవరణలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయ్​మెంట్​ ఆఫీసర్  మైత్రి ప్రియ తెలిపారు.

 ప్రైవేట్​ సంస్థల్లో 200 ఖాళీలున్నాయని, 18 నుంచి 30 ఏండ్ల వయసు కలిగిన ఆసక్తి కలిగిన నిరుద్యోగులు టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. జాబ్​ను బట్టి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు 9948568830 నంబర్ లో సంప్రదించాలని కోరారు