కృష్ణా నది జలాల పంపకాలపై సుప్రీంకోర్టులో విచారణ

కృష్ణా నది జలాల పంపకాలపై సుప్రీంకోర్టులో విచారణ

న్యూఢిల్లీ : కృష్ణా నది జలాల పంపకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మార్చి14 కు కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కృష్ణా నది జలాల పంపకాలపై కర్ణాటక సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. కృష్ణా నది జలాల కేటాయింపుపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో అవార్డును వెల్లడించిందని పిటిషన్ లో కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. ఈ పిటిషన్లపై ఈ నెల 10, 11 తేదీల్లో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కోర్టుల్లో సుదీర్ఘ వాదనలు సాగాయి. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. రామసుబ్రమణియన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ తరపు సీనియర్ అడ్వకేట్ సీఎస్ వైద్యనాధన్ హాజరయ్యారు.