లింగోజీగూడలో.. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

లింగోజీగూడలో.. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, దళిత సంఘాల నాయకులు బుధవారం ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు.

గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్, లింగోజిగూడ అంబేద్కర్ యువజన సంఘం కామిల వెంకటరమణ ఆధ్వర్యంలో ఆందోళన చేసి ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సరూర్ నగర్ సీఐ సైదిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. అంబేద్కర్ విగ్రహ ధ్వంసం దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.