విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప లీడ్ రోల్స్‌లో ఖగేష్ తమ్మినేని తెరకెక్కించిన చిత్రం ‘అనకాపల్లి’. కాండ్రేగుల నాయుడుతో కలిసి దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మించారు. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోందని టీమ్ తెలియజేసింది. ఈ సందర్భంగా మంగళవారం థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ విక్రమ్ సహిదేవ్ థ్యాంక్స్ చెప్పాడు.
‘అనకాపల్లి’ అసలు సిసలు విజయాన్ని సాధించిందని నటి ఇంద్రజ అన్నారు. విడుదలైన అన్ని సెంటర్స్‌లో హౌస్‌ఫుల్స్ పడుతున్నాయని, తమకొస్తున్న ఈ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చిందని నిర్మాతలు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు అన్నారు. లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ‘మా అబ్బాయి విక్రమ్ నటించిన ఈ మూవీ సక్సెస్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. దసరా ధమాకాగా ఈ చిత్రం నిలుస్తుంది’ అని అన్నారు.
