కరోనాతో అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత

V6 Velugu Posted on May 03, 2021

విశాఖ: అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బంహరి(68) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో మొదట్లో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తర్వాత విశాఖలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో  చేరారు. సబ్బంహరి పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆయనను వెంటిలేటర్‌ పై ఉంచి ట్రీట్ మెంట్ అందించారు. సోమవారం ఉదయం నుంచే ఆయన పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో సబ్బంహరి కన్నుమూసినట్టు తెలిపారు డాక్టర్లు. సబ్బం హరి విశాఖపట్నం మేయర్ గానూ పని చేశారు.
సబ్బం హరి మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Tagged corona, VIZAG, expired, Anakapalli, , Former mp Sabbam hari

Latest Videos

Subscribe Now

More News