
అనకాపల్లి జిల్లా లో ఫేక్ నోట్ల కలకలం రేగింది. నర్సీపట్నం నెల్లిమెట్ట జంక్షన్ సమీపంలో నకిలీ నోట్లు ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నెల్లిమెట్ట జంక్షన్ ...బుచ్చింపేట .. రహదారిలో తణుకు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రోడ్డుకి పక్కగా ఆపి ఉన్న AP 39 EW 9681 నెంబర్ గల కారులో తనిఖీలు నిర్వహించగా.. ఐదుగురు అనుమానితులను పోలీసులు గుర్తించారు. వారు పారిపోవడానికి ప్రయత్నించగా ముగ్గురు పోలీసులకు చిక్కారు. మరో ఇద్దరు పరారయ్యారు. నిందితుల నుంచి 2 లక్షల 60 వేల రూపాయల విలువైన అసలు కరెన్సీ తోపాటు 10 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
అమెజాన్ 'చిల్డ్రన్స్ బ్యాంక్' పేరుతో ఆర్డర్ చేసి నకిలీ నోట్లను తీసుకొచ్చామని తమ విచారణలో నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. అమాయకుల దగ్గర వీటిని మారుస్తూ.. రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఫేక్నోట్ల ముఠాలోని ఐదుగురు సభ్యుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులు విజయనగరంకు జిల్లాకు చెందిన ప్రదీప్ నగర్, వీ. టీ అగ్రహారం కి చెందిన నిమ్మల మనోహర్, తమ్మినేని సుమంత్ కుమార్, నిమ్మల మన్మద లను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.