Gam Gam Ganesha Trailer: క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా ‘గం గం గణేశా’ ట్రైలర్‌..ఆనంద్ దేవరకొండ ఓ వెరైటీ దొంగ

Gam Gam Ganesha Trailer: క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా  ‘గం గం గణేశా’ ట్రైలర్‌..ఆనంద్ దేవరకొండ ఓ వెరైటీ దొంగ

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) హీరోగా వచ్చిన బేబీ మూవీ ఇండస్ట్రీ హిట్ అయినా విషయం తెలిసిందే.చిన్న సినిమాగా వచ్చి కలెక్షన్స్ విషయంలో బాక్సాపీస్ వద్ద సత్తా చాటింది. ఈ మూవీ తర్వాత ఆనంద్ చేసే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. 

ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ మరో మూవీతో థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు.గం గం గణేశా(Gam Gam Ganesha) అనే మూవీలో నటిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతుంది. ఈ చిత్రంలో ప్రగతి శ్రీవా స్తవ, కరిష్మా హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌ గా నటిస్తున్నారు. 

తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆనంద్ దేవరకొండ తనదైన లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. అలాగే పంచ్ డైలాగులతో ట్రైలర్ షురూ కాగా..ఇందులో అమ్మాయిలకు వల విసురుతూ అబద్దాలు చెబుతూ నవ్విస్తున్నాడు. వినాయక చవితి చుట్టూ తిరిగే కథ ఇది. ఒక దొంగగా ఉన్న అతని జీవితం చివరికి ఎలా మలుపు తిరుగుతుందో ట్రైలర్లో  చూపించారు. 

వెన్నెల కిశోర్, జబర్దస్త్ ఇమ్మానుయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హై-లైఫ్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై కేదార్‌‌‌‌‌‌‌‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నఈ మూవీ మే 31న థియేటర్లలో రిలీజ్ కానుంది.