మట్టికుండ.. ఫ్రిడ్జ్.. ఏది గొప్పదో.. ఎందుకో చెప్పిన ఆనంద్ మహీంద్రా

మట్టికుండ.. ఫ్రిడ్జ్.. ఏది గొప్పదో.. ఎందుకో చెప్పిన ఆనంద్ మహీంద్రా

నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తించే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్మహీంద్రా సోషల్ మీడియాలో తాజాగా మరో ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ చేసే ఆసక్తికరమైన స్ఫూర్తినిచ్చే,చమత్కారంతో కూడిన ట్వీట్స్ నెటిజన్లలో ఎంతో ఆసక్తిని కలిగిస్తుంటాయి. తాజాగా వేసవికాలం దృష్ట్యా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. భారత దేశంలో సాంప్రదాయ బద్దంగా నీటిని నిల్వచేసేందుకు వాడే మట్టి కుండలకు(సురాహి),రిఫ్రిజిరేటర్‌కు మధ్య ఉన్న తేడాను సునిశితంగా చెబుతూ పోస్ట్ చేశాడు. 

ఫ్రిడ్జ్ గొప్పదా? మట్టికుండ గొప్పదా? రెండింటి మధ్య తేడాలను వివరిస్తూ ఓ ప్రొఫెసర్ ట్వీట్ చేశాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు కూడా ఈట్ట్వీట్ ఆసక్తికరంగా కనిపించింది. వెంటనే సదరు ప్రొఫెసర్ పెట్టిన రీ ట్వీట్ చేస్తూ మట్టి కుండ గొప్పదనం గురించి తనదైన శైలిలో వివరించాడు. ” ఇది స్పష్టమైన, తేలికైన పోలిక. శక్తివంతమైన ఫ్రిడ్జ్ అంతరించిపోయే ప్రమాదం లేదు” అని వ్యాఖ్యానించాడు. ప్రొఫెసర్ బోల్ నాథ్ దత్తా చేసిన ట్వీట్ను ఉటంకిస్తూ ఆనంద్ మహీంద్రా ఈ ట్వీట్ చేశాడు. ఆనంద్ మహీంద్రా సరదాగా ట్వీట్లు చేయడం, ఇతర విషయాలపై స్పందించడం ఇదేం కొత్త కాదు. ఆయనకు ఏదైనా ఆసక్తికరంగా అనిపిస్తే వెంటనే తనదైన శైలిలో సమాధానం ఇస్తాడు. చతురత కూడిన భాష ఉపయోగిస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటాడు.

‘‘నిజానికి డిజైన్‌,సౌందర్యం పరంగా సురాహి(కుండ) ఉన్నతమైనది. రిఫ్రిజిరేటర్‌తో పోలిస్తే సురాహి (మట్టితో చేసిన నీటి కుండ) చాలా సరసమైనది.  తక్కువ సైజులో, ఎక్కడికంటే అక్కడికి మార్చుకునేలా ఉండే లైట్ వెయిట్ వస్తువు.’’ ఆనంద్ మహీంద్ర తెలిపారు. అంతేకాదు రిఫ్రిజిరేటర్ ధర 10వేల రూపాయిల కంటే ఎక్కువగా ఉంటుంది. దీని నిర్వహణ వ్యయం కూడా ఎక్కువే. దీనికి ప్రత్యేకంగా స్థలం కావాల్సి ఉంటుంది అని రాశాడు. ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్‌ కూడా ఫ్రిజ్ గురించి కాకుండా ‘సురాహి’ గురించి పాడిన పాటను ఆయన హాస్యాస్పదంగా పేర్కొన్నారు. అయితే ఆనంద్ మహీంద్రా ట్వీట్‌‌తో కొందరు నెటిజన్లు ఏకీభవించారు. మరికొందరు ఇది అసాధ్యమని విభేదించారు.

''సురాహి నీటిని నిల్వ చేయడానికి మాత్రమే. రిఫ్రిజిరేటర్లు చాలా రకాల పనులకు పనికి వస్తుంది. రిఫ్రిజిరేటర్ ఉన్నవారు కూడా సురాహిని కలిగి ఉంటారు. ఎందుకంటే ఇది నీటి రుచిని పెంచుతుంది . వేసవిలో చల్లగా ఉంచుతుంది. మేము రెండింటినీ పోల్చలేం సార్,'' అని ఒక యూజర్ రాశారు. మరొకరు ఇలా వ్యాఖ్యానించారు, ''ఇలాంటి మాటలు మాట్లాడితే నమ్మడం కష్టం. అని రాశాడు.దానికి ప్రతిస్పందిస్తూ, మిస్టర్ మహీంద్రా ఇలా వ్రాశారు, ''ఇది స్పష్టంగా తేలికైన పోలిక, కాబట్టి భయపడవద్దు, శక్తివంతమైన ఫ్రిజ్ అంతరించిపోయే ప్రమాదం లేదు!''

అయితే, రెండవ వినియోగదారు ఈ పోస్ట్‌తో ఏకీభవించారు. ''గత 16 యేళ్లుగా సురాహిని ఉపయోగిస్తున్నాం. సహజంగా చల్లబడిన నీరును ఇస్తుంది. అంతేకాదు నీటి రుచి మెరుగుపడుతుంది. దగ్గు జలుబు లేదా ఇతర అలెర్జీలు లేవు. చాలాకాలం ఏళ్లుగా ఐస్ తీసుకోవడం మానేశారు. మేం సురాహిని పూర్తిగా ఇష్టపడుతున్నామని '' ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా మట్టి కుండ గురించి ఊరకే చెప్పలేదు. ఎందుకంటే మహీంద్రా అనేది అతిపెద్ద కార్పొరేట్ సామ్రాజ్యం అయినప్పటికీ.. అందుకే మిగతా కార్పొరేట్ల కంటే ఆ పూర్తి విభిన్నమైన క్యారెక్టర్ . వేసవికాలంలో తమ కార్యాలయాల్లో ఫ్రిడ్జిలతో పాటు కుండలను కూడా వినియోగిస్తారు. నీటిని చల్ల పరచడంతో పాటు, మాలినాలు లేకుండా శుభ్రం చేస్తుందని మహీంద్రా యాజమాన్యం నమ్మకం. ఉద్యోగులు కూడా కుండల్లోని నీరునే ఇష్టంగా తాగుతారు. చాలామంది ఆనంద్ మహీంద్రా పెద్ద కార్పొరేట్ సంస్థకు యజమాని అనుకుంటారు కానీ.. ఆయన ట్విట్టర్లో ట్వీట్లు చూస్తే.. సాధారణంగా మన ఇంటి పక్క ఉండే మామూలు మధ్యతరగతి కుటుంబాన్ని నుంచి వచ్చిన వాడిలాగా కనిపిస్తాడు