పద్మ అవార్డుకు నేను అనర్హుడిని 

పద్మ అవార్డుకు నేను అనర్హుడిని 

కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తుంది. అయితే గతేడాది కరోనా కారణంగా నిలిచిన అవార్డుల కార్యక్రమాన్నిఈ ఏడాది నిర్వహించింది. తాజాగా పలువురు ప్రముఖులు, సామాన్యులు, పలు సేవాకార్యక్రమాలు చేసిన వారికి పద్మ పురస్కారాలు అందించింది. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా పద్మభూషన్ అవార్డు అందుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన  చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పద్మ పురస్కరానికి తాను అనర్హుడని పోస్టు పెట్టారు ఆనంద్ మహీంద్ర. దంతో ఇప్పుడు నెటిజన్లు  ఆయన చేసిన ట్వీట్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. 

ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌లో ‘ ఈ ప్రభుత్వం... పద్మ అవార్డు గ్రహీతల విషయంలో పరివర్తమైన మార్పులు చేసింది. సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అట్టడుగు స్థాయి వ్యక్తులపై కూడా దృష్టి పెట్టింది. ఇలాంటి గొప్ప వ్యక్తుల పక్కన అవార్డు తీసుకునేందుకు నేను నిజంగా అనర్హుడిగానే భావిస్తున్నా అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం 30వేల మొక్కలు నాటిన శ్రీమతి తులసి గౌడ పద్మ అవార్డు తీసుకుంటున్న ఫోటోను కూడా ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. 

అటు నెటిజన్స్ స్పందిస్తూ.. మీరు ఈ అవార్డుకు తగిన వ్యక్తే నంటూ కొనియాడారు. సమాజ సేవకులతో పాటు.. మీలాంటి పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగవకాశాలు కల్పించేవారు, సంపదను సృష్టించేవారు కూడాఈ సమాజానికి ఎంతో అవసరం అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.