RRR: ఆర్ఆర్ఆర్ పాటకు ఆనంద్ మహీంద్ర స్టెప్పులు

RRR: ఆర్ఆర్ఆర్ పాటకు ఆనంద్ మహీంద్ర స్టెప్పులు

ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ వైడ్ గా ఏ మేరకు హిట్టయిందో..అందులోని పాటలు అంతే సూపర్ హిట్టయ్యాయి. ముఖ్యంగా  నాటు నాటు సాంగ్ కు థియేటర్లు షేక్ అయ్యాయి. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ప్రపంచ ప్రఖ్యాత అవార్డులు దక్కాయి. అయితే ఈ పాటకు మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర స్టెప్పులేశారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ రేసు ఈవెంట్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ రేస్ కు ఆనంద్ మహీంద్రా హాజరైన ఆనంద్ మహీంద్రా సరదాగా రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. నాటు నాటు పాటకు రామ్ చరణ్ దగ్గర బేసిక్ స్టెప్పులు నేర్చుకున్నందుకు సంతోషంగా ఉందని ఆనంద్ మహీంద్రా అన్నారు. డాన్స్ చేస్తున్న వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.