మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించట్లేదు

V6 Velugu Posted on Jun 07, 2021

కొన్ని ఆటంకాల కారణంగా ఔషధ పంపీణీ సవ్యంగా సాగటం లేదన్నారు కృష్ణపట్నం ఆనందయ్య. పంపిణీకి సరపడా వనరులు సమకూరడంలేదన్నారు. విద్యుత్ సౌకర్యం, ఔషధ తయారీకి యంత్ర సామాగ్రి లేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప సహకారం లేదన్నారు. ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు కరోనా మందును అందిస్తామన్నారు. ఇవాళ(సోమవారం) సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే మందు అందిస్తామన్నారు. అంతేకాదు..కృష్ణపట్నంలో ఔషధ పంపిణీ కొనసాగుతోందన్న ఆనందయ్య.. స్థానికేతరులు ఎవరూ కృష్ణపట్నం రావద్దని కోరారు. 

Tagged government, Anandayya, no cooperation, except permission

Latest Videos

Subscribe Now

More News