ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్ తో కలిసి దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపం వేద పండితులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌కి వేద ఆశీర్వాదం అందించారు.
ఇటీవలే అనంత్ అంబానీ నిశ్చితార్ధం రాజస్థాన్‌లోని శ్రీనాథ్‌జీ టెంపుల్‌లో జరిగింది. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ విరెన్ మర్చెంట్ కూతురు రాధిక మర్చెంట్‌ను అనంత్ అంబానీ పెళ్లి చేసుకోనున్నారు. రాధికకు, అనంత్‌కు గత కొన్నేళ్ల నుంచి పరిచయం ఉంది. అనంత్ అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీలో చదువును పూర్తి చేశాడు. అప్పటి నుంచి జియో ప్లాట్‌ఫాంతో పాటు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులలో సభ్యునిగా సహా వివిధ హోదాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పనిచేశాడు. ఇక రాధిక న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
