అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి ఎన్నిక వాయిదా

 అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి ఎన్నిక వాయిదా


జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 25న నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారమైతే మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 7న అక్కడ ఎలక్షన్స్ జరగాలి. అయితే స్థానికంగా హిమపాతంతో ఎన్నికకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. 

జమ్మూ కాశ్మీర్ బీజేపీ యూనిట్ చీఫ్ రవీందర్ రైనా, జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ చీఫ్ అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు ఇమ్రాన్ అన్సారీ ఇతరులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరారు. దీంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.  

మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా 20 మంది బరిలో ఉన్నారు. హిమపాతంతో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున ఎన్నికల తేదీ మార్చాలని వివిధ పార్టీలు కోరడంతో ఈసీ తన నిర్ణయాన్ని వెలువరించింది. అయితే ఈసీ నిర్ణయాన్ని పీడీపీ పార్టీ తప్పుబట్టింది.