లీడ్‌‌ రోల్‌‌లో..అనన్య నాగళ్ల

లీడ్‌‌ రోల్‌‌లో..అనన్య నాగళ్ల

మల్లేశం, వకీల్‌‌సాబ్‌‌ చిత్రాలతో మంచి గుర్తింపును  తెచ్చుకున్న అనన్య నాగళ్ల ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తోంది.  అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తోంది. వాటిలో ఆమె లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తోన్న  హారర్ థ్రిల్లర్‌‌ ‘తంత్ర’. నటుడు  శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌‌ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. మరో కీలక పాత్రలో సలోని నటిస్తోంది. శ్రీనివాస్‌‌ గోపిశెట్టి దర్శకత్వంలో  పి.నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్నారు.

శుక్రవారం కాన్సెప్ట్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  అనన్య ముఖాన్ని భీకరంగా ఉన్న ముగ్గురు చేతులు మూసినట్టు కనిపిస్తున్న పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాధల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది అని దర్శకనిర్మాతలు చెప్పారు.