బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే పర్సనల్ లైఫ్ మళ్లీ బీ-టౌన్‌లో ఊహించని హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా మోడల్ వాకర్ బ్లాంకోతో సీక్రెట్ లవ్ ట్రాక్ నడిపిస్తున్న ఈ భామ.. ఇప్పుడు అతనికి గుడ్ బై చెప్పేసిందనే వార్త సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. ఎలాంటి హంగామా లేకుండా, చాలా సైలెంట్‌గా వీరిద్దరూ తమ బంధానికి స్వస్తి చెప్పినట్లు ప్రచారం తెగ చక్కర్లు కొడుతోంది.
అంబానీ పెళ్లిలో చిగురించిన ప్రేమ..
2024లో జరిగిన అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ రాయల్ వెడ్డింగ్ వేడుకల్లోనే వీరిద్దరి మధ్య తొలి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ముదిరి లవ్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒకానొక సమయంలో వాకర్ పేరులోని మొదటి అక్షరం 'W' ఆకారంలో ఉన్న ఒక స్పెషల్ లాకెట్‌ను అనన్య ధరించి తమ లవ్ కు సంకేతాలు ఇచ్చింది. అంతేకాకుండా.. అనన్య పుట్టినరోజున వాకర్ సోషల్ మీడియా వేదికగా 'మై స్పెషల్ వన్' అంటూ పెట్టిన పోస్ట్ వీరి రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న ఊహాగానాలకు బలం చేకూరింది.
సైలెంట్‌గా లవ్ చాప్టర్ కు ఎండ్?
అయితే, ఇటీవల వీరిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో, పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా 'ఫ్రెండ్స్‌గా ఉందాం' అంటూ చాలా డీసెంట్‌గా ఈ లవ్ చాప్టర్‌కు ఎండ్ కార్డ్ వేసినట్లు సోష్ మీడియాలో జోరుగుగా ప్రచారం సాగుతోంది.
వరుస బ్రేకప్‌లు..
వాకర్ బ్లాంకో కంటే ముందు, హెండ్సమ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో అనన్య చేసిన రొమాంటిక్ డేటింగ్, పోర్చుగల్ వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన పిక్స్ ఎంత రచ్చ చేశాయో తెలిసిందే. ఆదిత్యతో బ్రేకప్ అయ్యాక వాకర్‌తో క్లోజ్‌గా మూవ్ అయిన ఈ లైగర్ బ్యూటీ, మళ్లీ ఇప్పుడు సింగిల్‌గా మారిపోయిందంటూ నెట్టింట్ చర్చ జరుగుతోంది. అయితే ఈ బ్రేకప్ రూమర్లపై అనన్య కానీ, వాకర్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇది కేవలం ప్రచారామా? లేక నిజంగానే ఈ క్యూట్ కపుల్ విడిపోయారా? అనేది క్లారిటీ రావాలంటే ఈ బాలీవుడ్ బ్యూటీ నోరు విప్పాల్సిందే మరి.
