‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అంటున్న యాంకర్ ప్రదీప్

‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అంటున్న యాంకర్ ప్రదీప్

బుల్లితెర నటుడు ప్రదీప్ మాచిరాజు వెండితెర హీరోగా మారాడు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ఇందులో అమృత అయ్యర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్ర మ్యూజిక్ పోస్టర్‌ను హీరో రానా చేతుల మీదుగా శనివారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌‌లో ప్రదీప్ పల్లెటూరి యువకుడి వేషంలో చక్కగా కనిపిస్తున్నాడు.

ఇప్పటికే అనసూయ, రష్మి, శ్రీముఖి లాంటి స్టార్ యాంకర్లు అటు యాంకరింగ్ చేస్తూనే.. ఇటు సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకుల్లో తమ ఇమేజ్‌ను పెంచుకుంటున్నారు. పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించి తమ సత్తా నిరూపించుకున్నారు. ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు కూడా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రదీప్ గతంలోనే కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. కానీ, హీరోగా నటించడం మాత్రం ఇదే మొదటిసారి.

ఈ సినిమాను ఎస్‌వీ ప్రొడక్షన్స్ పతాకంపై కన్నడ నిర్మాత ఎస్‌వీ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మున్నా నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.

రానా చేతుల మీదుగా విడుదలయిన ఈ సినిమా మ్యూజిక్ పోస్టర్‌ను ప్రదీప్ తన యూట్యూబ్ చానెల్‌లో విడుదల చేశారు. ఆ వీడియోకు జతగా ‘సెలయేటి మధ్యలో ఆ పూల పరిమళం..‬ ‪నీ నీలి కళ్ళలో నా ప్రేమ మధురం..‬ ‪30 రోజుల్లో ప్రేమించటం ఎలా!’ అనే కవితను ట్యాగ్ చేశారు.‬

For More News..

యువతకు పార్ట్ టైం జాబ్‌గా ర్యాపిడ్ రైడ్

లారీ డ్రైవర్‌‌‌‌గా అల్లు అర్జున్?