
బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్(Rashmi Gautham) పెళ్లి వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె పెళ్లి విషయంపై జోష్యం చెప్పారు జబర్దస్త్ కమెడియన్. ఆమె అమెరికా అబ్బయిని పెళ్లిచేసుకోబోతుందంటూ హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ కమెడియన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ప్రసారమైన జరబర్దస్థ్ ఎపిసోడ్ లో భాగంగా బులెట్ భాస్కర్ ఒక స్కిట్ చేశారు.
ఈ స్కిట్ లో భాగంగా.. రాజు గెటప్ లో కనిపించిన బులెట్ భాస్కర్ రష్మీ దగ్గరకు వెళ్లి.. మన బాబు జీతాలు బాగానే ఇస్తున్నట్టున్నాడు కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది అని అన్నాడు. దానికి రష్మీ నవ్వేసింది. అనంతరం స్టేజిపైకి వచ్చిన బులెట్ భాస్కర్ ను తన అసిస్టెంట్ సుధీర్, రష్మీకి పెళ్లి అవుతుందా? అని అడుగుతాడు. దానికి సమాధానంగా.. నిన్ననే జాతకాలు చూపించా. పెళ్లి అవుతుంది కానీ, రష్మీకి అమెరికా అబ్బాయితో.. సుధీర్ కు అమలాపురం అమ్మాయితో అని అంటారు. దాంతో ఒక్కసారిగా స్టేజీపై నవ్వుల పువ్వులు పూశాయి.
ALSO READ | Vijay Devarakonda: కొత్తవారితో రిస్క్ చేయను.. అందుకే నో ఛాన్స్.. విజయ్ షాకింగ్ కామెంట్స్
స్కిట్ లో భాగంగా జరిగినప్పటికే ఆడియన్స్ మాత్రం నిజంగానే చెప్పాడని అనుకుంటున్నారు. నిజానికి చాలా కాలంగా సుధీర్, రష్మిల పెళ్లిపై వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ, ఈ ఇద్దరు మాత్రం ఇప్పటివరకు రెస్పాండ్ అవలేదు. ఫ్యాన్స్ మాత్రం ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకుంటున్నారు.