‘పటాస్’ షోతో యూత్ కు బాగా దగ్గరైంది యాంకర్ శ్రీముఖి. ఈ షోలో లౌడ్ వాయిస్‌తో ఆమె చేసిన అల్లరి ఆడియెన్స్‌కు బాగా నచ్చింది. ఆ తర్వాత ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొనడం కోసం ‘పటాస్’ నుంచి బయటికొచ్చింది. ‘బిగ్‌బాస్’ కోసం చాలా షోలను వదిలేసుకుంది శ్రీముఖి. బిగ్‌బాస్ అయిపోవడంతో మళ్లీ శ్రీముఖి ‘పటాస్’ షో చేస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే శ్రీముఖి మాత్రం మరో కొత్త షోతో ఆడియెన్స్ ముందుకు రానుంది.
‘బిగ్‌బాస్’ ఆఫర్ ఇచ్చిన ‘స్టార్ మా’ చానెల్ లోనే యాంకర్ గా శ్రీముఖి కొత్త షో చేస్తుంది. అయితే ఈ షో ఏంటి అనే వివరాలు తెలియకుండా ‘స్టార్ మా’ ఒక ప్రోమో విడుదల చేసింది. ‘యువర్ లౌడ్ స్పీకర్ ఈజ్ బ్యాక్’ అంటూ ఒక కొత్త షోతో ముందుకు రానున్నట్లు శ్రీముఖి ఈ ప్రోమోలో చెప్పింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇది ‘స్టార్ట్ మ్యూజిక్’ అనే షో కావొచ్చనుకుంటున్నారు.ఈ షో మొదటి సీజన్‌కుసీనియర్ యాంకర్ ఝాన్సీ హోస్ట్‌గా చేసింది. రెండో సీజన్‌కు శ్రీముఖి చేసే అవకాశంఉంది. ఇది ఆమెకు యాంకర్ గా
రీఎంట్రీ అవుతుంది. వచ్చే నెలలో ఈ షో మొదలవుతుంది
