టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి(Sreemukhi) బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఓపక్క యాంకర్ గా ఫుల్ బిజీగా ఉంటూనే.. అడపాదడపా సినిమాలు చేస్తున్న శ్రీముఖి ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ పెట్టేసిందట. అది కూడా పాన్ ఇండియా స్టార్ సినిమాలో. ప్రస్తుతం ఈ టాపిక్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రెజెంట్ టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నారు శ్రీముఖి. ఎంతలా అంటే.. టీవీలో ఏ ఛానల్ పెట్టినా ఆమెనే కనిపించే అంతలా.
బుల్లితెరలో అంత బిజీగా ఉన్నప్పటికీ.. అవకాశం చిక్కినప్పుడల్లా సినిమాల్లో కూడా నటిస్తోంది ఈ అమ్మడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటించిన శ్రీముఖి ఖుషీ నడుము సీన్ ను రీక్రియెట్ చేసి స్క్రీన్ పై రచ్చ రచ్చ చేసింది. ఇక అప్పటినుండి మరో సినిమాలో కనిపించని శ్రీముఖి.. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది ఈ కాంబో. నిజానికి దర్శకుడు అట్లీ సినిమాల్లో ఆడవాళ్ళ పాత్రలకి మంచి ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాలో కూడా అల్లు అర్జున్ చెల్లిగా ఒక ప్రత్యేకమైన పాత్రను రాశాడట అట్లీ. ఆ పాత్రం కోసం, శ్రీముఖిని తీసుకోనున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. ఇక గతంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ జులాయిలో కూడా శ్రీముఖి బన్నీకి చెల్లిగా నటించింది. ఇప్పుడు మరోసారి ఆయనకు చెల్లిగా కనిపిపంచనుంది శ్రీముఖి. దాంతో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయమని అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.