
ప్రముఖ టీవీ యాంకర్ సుమ ఇంటిపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించినట్టు వచ్చిన వార్తలపై ఆమె స్పందించింది. అవన్నీ రూమర్స్ అని, తాను జీఎస్టీ కడుతున్నానని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.
`ఈ మధ్య ఒక న్యూస్ రౌండ్స్ కొడుతుంది. సుమ వాళ్ల ఇంట్లో జీఎస్టీ రైడ్స్ జరిగాయని, సుమ జీఎస్టీ కట్టలేదని. నేను జీఎస్టీ రెగ్యులర్‌గా కడుతున్నాను. అన్ని రికార్డ్స్ కరెక్ట్‌గా ఉన్నాయి. జీఎస్టీ మొదలు పెట్టిన దగ్గరనుంచి నేను కరెక్ట్‌గా కడుతూ వస్తున్నాను. నేను చట్టాన్ని గౌరవిస్తాను. ఇలాంటి గాసిప్స్, రూమర్స్ చాలానే వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ఖండిస్తూ కూర్చోవాలా.? లేదంటే ఇళ్లు, పిల్లలు, నా వర్క్ చూసుకోవాలా అని నేను చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాను. అయితే ఈ వార్తలను నేను ఖండించకపోతే, అది కాస్త అందరి నోళ్లలో నాని నిజమనుకునే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ వార్తలను ఖండించాల్సి వచ్చింది. నేను జీఎస్టీ సరిగ్గా కడుతున్నాను. నా ఇంటి మీద ఎలాంటి దాడులు జరగలేదు` అని స్పష్టం చేసింది సుమ.
There is a news that gst raids have happened in my house . Which house ? Where? I have been a prompt payer of gst. I have worked hard to reach this position. Why don’t some newspapers and channels check the authenticity before posting such rubbish about me. #behuman#beresponsible pic.twitter.com/h7GJLzhDLJ
— Suma Kanakala (@ItsSumaKanakala) December 22, 2019