కెరీర్,రిలేషన్,మెంటల్ హెల్త్ అన్నీ ఖరాబ్.. విష్ణు ప్రియ షాకింగ్ పోస్ట్

కెరీర్,రిలేషన్,మెంటల్ హెల్త్ అన్నీ ఖరాబ్.. విష్ణు ప్రియ షాకింగ్ పోస్ట్

టాలీవుడ్ యాంకర్ విష్ణు ప్రియ(Vishnu Priya)కు ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సుధీర్(Sudheer) తో ఆమె చేసిన పోరా పోవే(Pora pove) షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫాలోయింగ్ తోనే సినిమాల్లో, ప్రైవేట్ సాంగ్స్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది. కానీ.. ఏమైందో తెలియదు కొన్నిరోజులుగా ఆమె బుల్లితెరపైకి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమె బుల్లితెర నటుడు మానస్ ను పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అవి రూమర్స్ అని క్లారిటీ వచ్చేసింది. 

ఇదిలా ఉంటే.. తాజాగా విష్ణు ప్రియ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆమె ఎందుకు అలాంటి పోస్ట్ పెట్టిందని కన్ఫ్యూజ్ అవుతున్నారు నెటిజన్స్. ఇంతకీ విష్ణు ప్రియ ఎం పోస్ట్ పెట్టిందంటే.. ప్రస్తుత పరిస్థితి ఇది.. కెరీర్ ఖరాబ్, ఫిజికల్ హెల్త్ ఖరాబ్, మెంటల్ హెల్త్ ఖరాబ్, రిలేషన్ ఖరాబ్, షెడ్యూల్ ఖరాబ్..  అయినా ఇలా చిల్ అవుతూనే ఉన్నాను.. అని పోస్ట్ చేసింది. దానికి పబ్‌లో చిల్ అవుతున్న సల్మాన్ వీడియో యాడ్ చేసింది. మరి ఎందుకు విష్ణు ఇలాంటి పోస్ట్ పెట్టిందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కొందరేమో ఆమె రిలేషన్ షిప్ బ్రేక్ అయ్యుటుంది అందుకే ఇలాంటి సాడ్ పోస్ట్ పెట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.