సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల.. ప్రస్తుతం సిటీలో స్థలం కొనాలన్నా.. ఇల్లు కట్టలన్నా అది మధ్య తరగతి ప్రజలకు సాధ్యపడేది కాదు. ఎక్కడో ఊరు చివరన ఉండే స్థలాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఆ స్థలాల దగ్గరకొన్ని పురాతన కట్టడాలు ఉంటే దాని పక్కన స్థలం కొనవచ్చా.. ఇంటి డోర్ లు.. కిటికీలు లెక్కపెట్టేటప్పుడు మెయిన్ డోర్.. వెంటిలేటర్ లను కూడా లెక్కలోకి తీసుకోవాలా.. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారి సలహాలను ఒకసారి తెలుసుకుందాం. . .!
ప్రశ్న: ఉత్తర దక్షిణ దిక్కుల్లో పురాతన కోట గోడ ఉంది. ఆగోడను ఆనుకుని ఉన్న స్థలంలో, తూర్పు ఫేసింగ్ ఇల్లు కట్టుకోవచ్చా? అలాగే తూర్పు వైపు రోడ్ కూడా ఉంది.
జవాబు: పురాతన కోట గోడల దగ్గరైనా సరే తూర్పు ఫేసింగ్ తో ఇల్లు కట్టుకోవచ్చు. అయితే నేల ఉన్న దిక్కు, దాని షేప్ అన్నింటినీ పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు.
ప్రశ్న: ద్వారాలు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలన్నారు కదా. వాటిలో కాంపౌండ్ వాల్ మెయిన్ గేట్, వెంటిలేటర్స్ కూడా కలుపుకోవాలా?
జవాబు: ఏ ఇంటికైనా ద్వారాలు, కిటికీలు అన్నీ సరిసంఖ్యలోనే ఉండేలా చూసుకోవాలి. వాస్తు ప్రకారం బేసి సంఖ్య పనికిరాదు. అలాగే కాంపౌండ్ వాల్ గేట్స్, వెంటిలేటర్స్ ను ఈ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.
