కాగజ్ నగర్, వెలుగు: కాగజ్‌నగర్ మండలం అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జి మరింత కుంగింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పిల్లర్, స్లాబ్ మధ్య గ్యాప్పెరిగింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రమోద్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ తో కలిసి బ్రిడ్జిని పరిశీలించారు. అటువైపు ఎవరూ రాకుండా గోడకట్టించారు. ఇది ఇలాఉంటే మండలంలోని జగన్నాథ్‌పూర్‌కు చెందిన అనూష (30) సోమవారం జ్వరంతో మృతిచెందగా తిర్యాణి నుంచి ఆమె సోదరుడు, బంధువులు దహన సంస్కారాలకు వచ్చారు. బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేయడంతో పెద్దవాగు దాటి అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు యత్నించారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో మృతురాలి సోదరుడు నీటిలో కొట్టుకుపోతుండగా పోలీసులు కాపాడారు. చెల్లి చివరిచూపునకు వెళ్లేలా చూడాలని ప్రాదేయపడడంతో పోలీసులు అతికష్టం మీద ఆయనను బ్రిడ్జి దాటించారు. మిగతవారు అవతలి ఒడ్డునే ఉండి అంత్యక్రియలు చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు. కుంగిన బ్రిడ్జిని జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కాంగ్రెస్ నాయకుడు రావి శ్రీనివాస్ సాయంత్రం పరిశీలించారు.
పోన్కల్ మండలం ఏర్పాటు చేయాలి
నిర్మల్,వెలుగు: పోన్కల్ కేంద్రంగా మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, లీడర్లు కె. శ్రీహరి రావు, రాం కిషన్ రెడ్డి, హరీశ్‌రావు, భూమేశ్వర్ తదితరులు కలిశారు. గ్రామస్తులు చేస్తున్న ఆందోళన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మండలం ఏర్పాటు చేయాలన్సిన ఆవశ్యకతను వివరించారు.
ఎన్‌హెచ్ 63 కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలి
చెన్నూర్, వెలుగు: నేషనల్ హైవే 63 నిర్మాణంలో క్వాలిటీ లోపంతోనే చెన్నూర్ బతుకమ్మ వాగు బ్రిడ్జి దగ్గర రోడ్డుకు కోతకు గురైందని టీడీపీ పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం కన్వీనర్ సంజయ్‌కుమార్ అన్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. సోమవారం రోడ్డును పరిశీలించడానికి వెళ్తున్న సంజయ్‌కుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌హెచ్ కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే బాల్క సుమన్ వంతపాడుతున్నారని ఆరోపించారు. చెన్నూర్, సిరొంచ మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాని అన్నారు. ప్రజల తరపున రోడ్డును చూడటానికి వెళ్తే పోలీసులతో అడ్డుకున్న ఘనత సుమన్‌కే దక్కుతుందన్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్ పైన, ఎమ్మెల్యే బాల్క సుమన్ పైన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.
ముంపునకు గురైన కాలనీలు
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపాలిటీలోని 11 వార్డు రాజీవ్ నగర్ , జేకే కాలనీ ముంపునకు గురయ్యాయి. స్పందించిన మున్సిపల్ చైర్మన్ రాజేందర్, ఫారెస్ట్ రేంజర్ వినాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం కాలనీలను సందర్శిచారు. దెబ్బతిన్న సీసీ రోడ్లు , డ్రైనేజీల మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని చైర్మన్ రాజేందర్ ఆఫీసర్లను కోరారు. మున్సిపల్ కమిషనర్ రత్నాకర్ రావు, ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం, కౌన్సిలర్ కిశోర్ నాయక్ ఉన్నారు.
నిర్మల్ డీఎఫ్ వో బదిలీ
నిర్మల్,వెలుగు: నిర్మల్ డీఎఫ్‌వో వికాస్ మీనా నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో నిజామాబాద్ డీఎఫ్‌వోగా పనిచేస్తున్న సునీల్ ఎస్ హిరామత్ నియమితులయ్యారు. ఇక్కడ ఎఫ్‌డీవోగా పనిచేసిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ ఖమ్మం డీఎఫ్‌వోగా బదిలీ అయ్యారు.
హాస్టళ్లలో సన్న బియ్యం పెడుతలేరు
ఆదిలాబాద్, వెలుగు: సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యం పెట్టడం లేదని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆరోపించారు. సోమవారం ఆయన బంగారి గూడా మైనారిటీ గురుకులాన్ని సందర్శించారు. కేసీఆర్అబద్దాలకు బ్రాండ్అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని ఫైర్అయ్యారు. ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేశ్, మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అఫ్రోజ్ ఖాన్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కాంబ్లీ నాందేవ్, నాయకులు సంగ రాజు, యాదవ్ పాల్గొన్నారు.
ఎల్లంపల్లి 47 గేట్లు ఓపెన్
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. సోమవారం సాయంత్రం 47 గేట్లు ఓపెన్ చేసి 6.45 లక్షల క్యూసెక్కుల నీటిని వాటర్ చేశారు. ప్రాజెక్టు కెపాసిటీ 20.175 టీఎంసీలకు గాను 16.311 టీఎంసీల నీళ్లున్నాయి. 5.76 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 6.45 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాతోంది.
– మంచిర్యాల, వెలుగు
గడ్డెన్న వాగు ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత
భైంసా శివారులోని గడ్డెన్న ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా.. ఆదివారం 358.60 మీటర్ల వద్ద ఉంది. సోమవారం 20 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని కిందికి సుద్దవాగులోకి వదిలారు.తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో తోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. – భైంసా, వెలుగు
బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం
బాసర వద్ద గోదావరి నది రెండ్రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం వరద నీరు పుష్కర ఘాట్లను తాకింది. శివలింగాలు వరద నీటిలో మనిగాయి. దీంతో పీఠం విద్యార్థులు శాంతి పూజలు చేశారు. నదిలోకి ఎవరూ వెళ్లకుండా ఆఫీసర్లు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారు.
– బాసర, వెలుగు
సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
ఆదిలాబాద్/నిర్మల్,వెలుగు: జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్, నిర్మల్కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్‌అలీ ఫారూఖీ కోరారు. సోమవారం వారు జిల్లాల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈనెల 16న నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించాలన్నారు. గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. 17న హైదరాబాద్ జరిగే కార్యక్రమం కోసం అవసరమైన బస్సులు, భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. 18న జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. సమావేశంలో ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ లు రిజ్వాన్ బాషా, నటరాజ్, ట్రెయినీ కలెక్టర్ శ్రీజ, ఆర్డీవో రమేశ్ రాథోడ్, ఏఎస్పీ శ్రీనివాస్ రావు నిర్మల్అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఎస్పీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
సరోత్తం.. యూ టర్న్!
మంచిర్యాల, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒంటెద్దు పోకడలకు నిరసనగా త్వరలోనే టీఆర్ఎస్కు రాజీనామాలు చేస్తామని ప్రకటించిన సీనియర్ లీడర్ చెరుకు సరోత్తంరెడ్డి ఆ తర్వాత రెండ్రోజులకే యూ టర్న్ తీసుకున్నారు. ఎమ్మెల్యేతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే సరి చేసుకుంటామని, ఆయన నాయకత్వంలోనే పని చేస్తామని ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. సరోత్తంరెడ్డి గత శుక్రవారం భీమారంలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి బాల్క సుమన్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం తెలిసిందే. అవమానాలను భరిస్తూ పార్టీలో కొనసాగలేమని, త్వరలోనే 20వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి టీఆర్ఎస్కు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పేర్కొన్నారు. తన కూతురు భీమారం ఎంపీపీ దీపికారెడ్డి, జడ్పీటీసీ భూక్య తిరుమల, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు మరికొందరు రాజీనామాలు చేయనున్నారని తెలిపారు. ఈ వ్యవహారం టీఆర్ఎస్లో కలకలం సృష్టించింది. ఇదిలా ఉండగా, సరోత్తంరెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో బాల్క సుమన్‌ను కలిసినట్టు సమాచారం. అదే రాత్రి ఆయన ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని గాని, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను గాని ఎలాంటి పొరపాటు మాటలు మాట్లాడలేదని, పత్రికల్లో వేరేవిధంగా రావడం దురదృష్టకరమని అందులో పేర్కొన్నారు. ప్రెస్మీట్లో సుమన్ ఒంటెద్దు పోకడల కారణంగానే టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు చెప్పిన ఆయన ఇప్పుడు తాను ఏమీ అనలేదంటూ మీడియాపై తోసేయడం గమనార్హం. బ్లాక్ మెయిలింగ్ కోసం మీడియాను వాడుకోవడం తగదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మిత అయ్యల్వార్ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ
మంచిర్యాల, వెలుగు: మిత అయ్యల్వార్ సంక్షేమ సంఘం జిల్లా కమిటీని సోమవారం మంచిర్యాలలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నాగవెళ్లి వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శిగా సాత్వాడి విజయ్, ఉపాధ్యక్షుడిగా గడ్డల మధు, కోశాధికారిగా మార్కపురి రమేష్, ప్రచార కార్యదర్శిగా మధురకవి కృష్ణ, అసోసియేట్ అధ్యక్షుడిగా ధర్మపురి నర్సయ్య, సాంస్కృతిక సారధిగా మధురకవి కిష్టయ్య, సాంస్కృతిక కార్యదర్శిగా సాత్వాడి జనార్దన్, మహిళా కార్యదర్శిగా దురిశెట్టి హేమలత, సాంస్కృతిక మహిళా కార్యదర్శిగా తేలేటి స్వరూప, ముక్య సలహాదారుగా సత్వాడి నర్సయ్య ఎన్నికయయారు. రాష్ర్ట అధ్యక్షుడు త్రికోవెల సత్తయ్య ముఖ్యఅతిథిగా హాజరుకాగా, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
అశోక్ యాదవ్‌కు ఆదర్శ ఐకాన్ అవార్డు
మంచిర్యాల, వెలుగు: రాష్ర్ట గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు కొమ్ము అశోక్ యాదవ్‌కు హైదరాబాద్‌లోని ఆదర్శ కళా నిలయం ఆధ్వర్యంలో ఆదర్శ ఐకాన్ అవార్డు అందజేశారు. అశోక్ యాదవ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు కళా నిలయం అధ్యక్షుడు చీరాల ప్రకాశ్ తెలిపారు.
బీజేపీ పార్లమెంట్ ఇన్చార్జికి సన్మానం
ఖానాపూర్, వెలుగు: ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇన్చార్జిగా నియమితులైన అయ్యన్నగారి భూమయ్యను సోమవారం ఖానాపూర్ లీడర్లు కలిశారు. అనంతరం ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు టేకు ప్రకాశ్, పెంబి జడ్పీటీసీ భూక్యా జానుబాయి, లీడర్లు ఎనగందుల రవి, సుధాకర్, ఉపేందర్, సురేశ్, సదాశివ తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌హెచ్ 63 కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలి
చెన్నూర్, వెలుగు: నేషనల్ హైవే 63 నిర్మాణంలో క్వాలిటీ లోపంతోనే చెన్నూర్ బతుకమ్మ వాగు బ్రిడ్జి దగ్గర రోడ్డుకు కోతకు గురైందని టీడీపీ పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం కన్వీనర్ సంజయ్‌కుమార్ అన్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. సోమవారం రోడ్డును పరిశీలించడానికి వెళ్తున్న సంజయ్‌కుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌హెచ్ కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే బాల్క సుమన్ వంతపాడుతున్నారని ఆరోపించారు. చెన్నూర్, సిరొంచ మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాని అన్నారు. ప్రజల తరపున రోడ్డును చూడటానికి వెళ్తే పోలీసులతో అడ్డుకున్న ఘనత సుమన్‌కే దక్కుతుందన్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్ పైన, ఎమ్మెల్యే బాల్క సుమన్ పైన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.
పోన్కల్ మండలం ఏర్పాటు చేయాలి
నిర్మల్,వెలుగు: పోన్కల్ కేంద్రంగా మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, లీడర్లు కె. శ్రీహరి రావు, రాం కిషన్ రెడ్డి, హరీశ్‌రావు, భూమేశ్వర్ తదితరులు కలిశారు. గ్రామస్తులు చేస్తున్న ఆందోళన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మండలం ఏర్పాటు చేయాలన్సిన ఆవశ్యకతను వివరించారు.
టీచర్ల చేతిలో దేశ భవిష్యత్తు
భైంసా, వెలుగు: టీచర్ల చేతిలోనే దేశభవిష్యత్ఉందని డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్చెప్పారు. ఉత్తమ ఉపాధ్యయులుగా అవార్డు అందుకున్న44 మందిని సోమవారం భైంసాలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ రమణారావు, తపస్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణ్, లీడర్లు నాగేశ్, ఆనంద్ రావు పటేల్, వెంగల్రావు, సాయినాథ్, శ్రీనివాస్, రమేశ్, అమోల్, అంజద్తదితరులు పాల్గొన్నారు.
