‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం తన కెరీర్ లోనే మోస్ట్ పర్సనల్ సినిమా అని, ఎప్పటినుంచో తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఇందులో ఉన్నాయని హీరో రామ్ అన్నాడు. ఆయన హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఉపేంద్ర కీలకపాత్ర పోషించారు. మంగళవారం రాత్రి కర్నూల్‌లో ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ ‘నేను ఇప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలు చేశా. కానీ ఇది చాలా ఎమోషనల్ సినిమా.
నేను ఈ సినిమాకు ఫీల్ అయినంత ఎమోషన్‌ను గతంలో ఏ సినిమాకు ఫీల్ అవలేదు. ఇందులో నేను అభిమానిగా, ఉపేంద్ర గారు సూపర్ స్టార్‌గా నటించారు. ఒక స్టార్ అనేవాడు ఎలా ఆలోచిస్తే ఇలాంటి కథ చేయగలడు అనేది ఇది చూశాక మీకు అర్థమవుతుంది. ఇది అభిమానుల సినిమా. భాగ్యశ్రీ గ్లామరస్ గా కనిపిస్తూనే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది.
మహేష్ థియేటర్‌లో కాదు మనలో సౌండ్ వచ్చే సినిమా తీశాడు’ అని చెప్పాడు. హీరో రామ్ తన కెరీర్‌లో ప్రౌడ్‌గా ఫీలయ్యేలా ఈ సినిమా చేశామని దర్శకుడు మహేష్ బాబు చెప్పాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత వై రవిశంకర్, సంగీత దర్శకులు వివేక్, మెర్విన్ పాల్గొన్నారు.
